ఇడుపులపాయలో నిర్వహించిన క్రైస్తవ ప్రార్థనలో తితిదే ఛైర్మన్ పాల్గొనడంపై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుబ్బారెడ్డి చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. తితిదే ఛైర్మన్ హోదాలో ఉండి క్రైస్తవ ప్రార్థనలో పాల్గొనడం బాధాకరమని పేర్కొన్నారు. ఇడుపులపాయ కార్యక్రమంలో పాల్గొనడంపై సుబ్బారెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డి స్పందించకుంటే భాజపాతో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తితిదే నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానం కలుగుతుందని ఆరోపించారు.
ఆ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ పాల్గొనడంపై వివరణ ఇవ్వాలి: జనసేన - తితితే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి
ఇడుపులపాయలో క్రైస్తవ ప్రార్థనలో తితితే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి పాల్గొనడంపై వివరణ ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఆయన చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ ఆరోపించారు.
janasena