భాజపా నేతల అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా స్పందించారు. వారి అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. వాస్తవాల కోసం క్షేత్రస్థాయిలో పర్యటించడం పార్టీల బాధ్యత అని పేర్కొన్నారు. గుడివాడ వెళ్తుండగా భాజపా నాయకులను అరెస్టు చేశారన్న ఆయన.. అసలు గుడివాడలో జరిగిన పరిణామాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: భాజపా నేతల అరెస్టు అప్రజాస్వామికం: పవన్ కల్యాణ్
17:59 January 25
గుడివాడలో పరిణామాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: పవన్ కల్యాణ్
గుడివాడకు భాజపా నేతలు.. అడ్డుకున్న పోలీసులు
విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న భాజపా బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు తమ వాహనాల్లో బయల్దేరగా పోలీసులు అడ్డుతగిలారు. దీంతో గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డురోడ్డు వద్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో సోము వీర్రాజు తదితరులు వారితో వాగ్వాదానికి దిగారు. సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు.
ఇదీ చూడండి : నందమూరు అడ్డరోడ్డు వద్ద ఉద్రిక్తత...భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు