వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి.. హైకోర్టుకు జగన్ - jagan petition on cbi court verdict
15:30 January 27
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి.. హైకోర్టుకు జగన్
అక్రమాస్తుల కేసుల వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. తనకు మినహాయింపు ఇచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించడాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్న జగన్.. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని హాజరు మినహాయింపు నిరాకరించడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి