ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

10 మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు - New Municipalities In AP News

నూతనంగా ఏర్పాటైన 10 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. పాలకమండలి కొలువుదీరిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలన రద్దవుతుందని నోటిఫికేషన్​లో స్పష్టం చేశారు.

ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

By

Published : Mar 26, 2021, 6:53 PM IST

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 10 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రత్యేకాధికారుల పాలనను 2021 ఆగస్టు వరకూ పొడిగిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. గురజాల, దాచేపల్లి, కుప్పం, కమలాపురం మున్సిపాలిటీల్లో 2021 ఆగస్టు 7వ తేదీ వరకూ ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. ఆకివీడు, కొండపల్లి, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, పెనుకొండలో 2021 ఆగస్టు 20వ తేదీ వరకూ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్​లో పేర్కొంది. పాలకమండలి కొలువుదీరిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలన రద్దవుతుందని నోటిఫికేషన్​లో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details