ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఐరన్​ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత - students sick

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లా భీర్పూర్ మండలం తాంసి-కే పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటి మాదిరిగానే ప్రతి గురువారం విద్యార్థులకు ఐరన్ మాత్రలు మధ్యాహ్న భోజనానికి ముందు ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే ఒకరిద్దరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.

iron-tablets-make-students-sick-in-adialabad-district
ఐరన్​ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత

By

Published : Feb 13, 2020, 11:03 PM IST

ఐరన్​ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా తాంసి-కే పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనానికి ముందు ఉపాధ్యాయులు మాత్రలు పంపిణీ చేయగా ఈ ఘటన జరిగింది.

19 మంది విద్యార్థులకు అస్వస్థత

అనంతరం బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను ఆదిలాబాద్​ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొత్తం 19 మంది విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో కొందరు అడవి ఆముదం గింజలు తిన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది

విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఎంఈవో కౌసల్య, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, సర్పంచ్ కరీం ఆస్పత్రికి చేరుకొని దగ్గరుండి చికిత్స చేయించారు. రిమ్స్ డైరెక్టర్ బలరాం రాఠోడ్ నేతృత్వంలో పిల్లల వైద్య నిపుణులు అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్యం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

జగన్.. బెయిల్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు : సీబీఐ

ABOUT THE AUTHOR

...view details