ఇంటింటికీ రేషన్ సరుకుల రవాణాకు ప్రభుత్వం మినీ ట్రక్కులను అందించనుంది. రూ.5,81,100 విలువ చేసే వాహనాలను లబ్ధిదారులకు అందిస్తారు. వీటిపై 60% ప్రభుత్వం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం, పది శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.
విశాఖ జిల్లాలో..
నర్సీపట్నం పరిధిలోని 85 రేషన్ దుకాణాలకు సంబంధించి ట్రక్కులను అందజేసేందుకు అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రక్రియ ముగిసిన అనంతరం తుది జాబితా వెల్లడిస్తామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.
కృష్ణాజిల్లాలో..
నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ నిరుద్యోగులను అధికారులు ఇంటర్వ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా, నగర పంచాయతీ, బ్యాంకుల ప్రతినిధులు కమిటీ అధికారులు పాల్గొన్నారు. మినీ ట్రక్కుల కోసం ఎస్సీలు భారీగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.