తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరానికి చెందిన కల్యాణి... చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి వేమిరెడ్డి గోపిరెడ్డి సంరక్షణలో పెరిగింది. ఎర్రుపాలెంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి.. పరీక్షలు రాసింది. పరీక్షల్లో పాస్ అవుతానని... తన వారితో సంతోషంగా చెప్పిన కళ్యాణి... మార్కులు చూసుకోకుండానే మృత్యువాత పడింది.
'ఫలితాలు చూసుకోకుండానే.. అనంత లోకాలకు వెళ్లిపోయింది' - రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
దైవదర్శనానికి వెళ్లి 12 మంది మృత్యువాత పడిన ఘటనలో ఓ ఇంటర్ విద్యార్థి సైతం ప్రాణాలు వదిలింది. ఇటీవల విడుదలైన ఫలితాలల్లో ఉత్తీర్ణత సాధించిన ఆ అమ్మాయి... ఈ విషయం తెలుసుకోకుండానే ప్రాణాలు వదిలేసిందనే బాధ.. ఆ కుటంబసభ్యులకు మరింత కలిచివేసింది.
కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణా జిల్లా వేదాద్రి దైవదర్శానికి వెళ్తుండగా వీరి ట్రాక్టర్ను లారీ ఢీకొట్టిన ఘటనలో కల్యాణితో పాటు మరో 11 మంది మృతి చెందారు. తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాలు వారికి మరింత వేదనను కలిగించాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన కల్యాణి మొదటి సంవత్సర ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. కనీసం ఈ విషయం తెలుసుకోకుండానే తమ బిడ్డను మృత్యువు కబళించిందని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు