ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 54, రెండో సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని.. విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడించారు. ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తొలిస్థానంలో ఉండగా.. ఉమ్మడి కడప జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు.
- ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 2,41,591 మంది ఉత్తీర్ణత (54 శాతం)
- ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 2,58,449 మంది ఉత్తీర్ణత (61 శాతం)
- ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలురు 49, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత
- ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలురు 59, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత
- అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణత
- అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది ఉత్తీర్ణత