Live Video: శిల్పకళా వేదికలో విషాదం.. స్టేజ్ పైనుంచి పడి ఐబీ అధికారి మృతి - IB assistant director Amiresh died
23:23 May 18
Live Video: శిల్పకళా వేదికలో స్టేజ్ నుంచి పడి ఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీ స్థాయి అధికారి అమిరేశ్ ప్రమాదవశాత్తు వేదికపై నుంచి పడి మృతిచెందారు. శిల్పకళా వేదికలో శుక్రవారం సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తకం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు.
- ఇదీ చదవండి :మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్..
ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా... అధికారులు వేదికను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఫొటోలు తీస్తూ... వేదిక సమీపంలోని గుంతలో పడిపోయారు. తలకు తీవ్రగాయాలైన అమిరేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అమిరేశ్... బిహార్ వాసిగా అధికారులు తెలిపారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం: అమిరేశ్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమిరేశ్ మృతి వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు.