ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సన్న, చిన్నకారు రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ విడుదల

గత ఏడాది అకాల వర్షాల కారణంగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు ఇన్​పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9 జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినట్టుగా ప్రభుత్వం తేల్చింది.

Input Subsidy Release to Farmers
సన్న, చిన్నకారు రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ నిధులు విడుదల

By

Published : Oct 16, 2020, 10:42 PM IST

గత ఏడాది అకాల వర్షాల కారణంగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు ఇన్​పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు 12 కోట్ల 52 లక్షల రూపాయల ఇన్​పుట్ సబ్సిడీని చెల్లించేందుకు రెవెన్యూ శాఖ ఈ ఆదేశాలు ఇచ్చింది.

గత ఏడాది జులై, ఆగస్టు నెలల్లో పంట నీటమునిగి నష్టపోయిన రైతులకు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 9 జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినట్టుగా ప్రభుత్వం తేల్చింది.

ఇదీ చదవండీ... డోర్ డెలివరీ వాహనాల్లో రూ. 63 కోట్లు ఆదా: పౌరసరఫరాల శాఖ

ABOUT THE AUTHOR

...view details