ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇన్‌ఛార్జి మంత్రులు మారారు... ఏ జిల్లాకు ఎవరంటే!! - ఏ జిల్లాకు ఏ మంత్రి

రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేటాయించిన జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్ల నాని, సుభాష్ చంద్రబోస్, సుచరితను జిల్లా ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించారు. కొడాలి నాని, బాలినేని, ఆదిమూలపు సురేశ్‌కు కొత్తగా జిల్లా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

ఇన్‌ఛార్జి మంత్రులు మారారు... ఏ జిల్లాకు ఎవరంటే

By

Published : Oct 20, 2019, 8:53 PM IST

ప్రభుత్వం చిత్తూరు మినహా అన్ని జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మార్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా నియమితులైన జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా ఇన్​ఛార్జి మంత్రి
శ్రీకాకుళం కొడాలి నాని
విజయనగరం వెల్లంపల్లి శ్రీనివాస్‌
విశాఖపట్నం కురసాల కన్నబాబు
తూర్పుగోదావరి జిల్లా మోపిదేవి వెంకటరమణ
పశ్చిమగోదావరి పేర్ని నాని
కృష్ణా జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుంటూరు చెరుకువాడ రంగనాథరాజు
ప్రకాశం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నెల్లూరు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
చిత్తూరు మేకపాటి గౌతంరెడ్డి
కర్నూలు అనిల్​కుమార్‌ యాదవ్‌
అనంతపురం బొత్స సత్యనారాయణ
కడప ఆదిమూలపు సురేశ్

ABOUT THE AUTHOR

...view details