ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆలయ ట్రస్ట్ బోర్డులన్నీ తక్షణమే రద్దు'

రాష్ట్రంలోని అన్నివర్గాల వారికి భగవంతుడి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్ని ఆలయ ట్రస్ట్ బోర్డులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో 2,500 దేవాలయాలకు కొత్త ట్రస్ట్‌బోర్డుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

By

Published : Aug 31, 2019, 10:24 PM IST

రాష్ట్రంలోని అన్ని ఆలయ ట్రస్ట్ బోర్డులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. కొత్త ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయాలకు అతీతంగా సేవకే పెద్దపీట వేస్తామని చెప్పారు. ట్రస్ట్‌ బోర్డుల్లో బీసీలు, దళితులు, మహిళలకు 50 శాతం అవకాశం ఇస్తామన్న వెల్లంపల్లి... త్వరలో 2,500 దేవాలయాలకు కొత్త ట్రస్ట్‌బోర్డుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండ్రోజుల్లో కాణిపాకం దేవస్థానం కొత్త సేవా కమిటీని నియమిస్తామన్నారు. అన్నివర్గాల వారికి భగవంతుడి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details