ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ మద్యం సరిహద్దులు దాటుతోంది! - మద్యం అక్రమ రవాణా తాజా వార్త

తెలంగాణ మద్యం సరిహద్దు దాటుతోంది. రాత్రీ, పగలూ అనే తేడా లేకుండా తరలుతోంది. అధికారుల ఉదాసీనతతో ఈ దందా "మూడు ఫుల్లులు.. ఆరు క్వార్టర్లు"గా విరాజిల్లుతోంది. అక్రమార్కుల జేబులు నింపుతోంది. ఏపీ కంటే తెలంగాణ మందు ధర తక్కువ, నాణ్యత ఎక్కువ కావడం వల్ల వ్యాపారం జోరుగా సాగుతోంది.

illegal-liquors-transportation-through-state-boarders-in-khammam
సరిహద్దులు దాటుతున్న మద్యం సరుకు

By

Published : Jun 4, 2020, 4:59 PM IST

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా మద్యం అక్రమంగా ఏపీకి రవాణా అవుతోంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా మధిర ప్రాంత సరిహద్దుల్లో నుంచి రూ. లక్షల విలువ చేసే మద్యం ఏపీకి తరలిపోతోంది. తెలంగాణ కంటే ఏపీలో మద్యం ధరలు 75 శాతం అధికంగా ఉండటం వల్ల సరిహద్దు దాటి.. తెలంగాణలోని మద్యం దుకాణాలు నుంచి నేరుగా ఏపీకి తరలించి కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

మద్యం వ్యాపారులు పట్టుబడకుండా అక్రమార్కులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణలో మద్యం సీసాలపై బార్​ కోడ్​ నెంబర్లు ఉంటాయి.. వాటిని గుర్తిస్తే అవి ఏ దుకాణం నుంచి తరలించేది తెలిసిపోతుందని వాటిపై ఉన్న లేబుళ్లు తొలగించి మరీ ఏపీకి రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఫలితంగా.. ఈ ప్రాంతం నుంచి మద్యం తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామ గొలుసుకట్టు దుకాణాల నుంచి విజయవాడకు తరలిస్తున్న 1,214 మద్యం సీసాలను ఇటీవల గంపలగూడెం పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. మధిరకు చెందిన ఓ మద్యం గుత్తేదారు తన సొంత కారులో ఆంధ్రప్రదేశ్​కు మద్యం తరలిస్తూ సరిహద్దు చెక్​పోస్ట్ మాటూరు రాజవరం వద్ద పట్టుబడ్డాడు. ఇటువంటి ఉదంతాలు ఎన్నో జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించటం అనేక విమర్శలకు తావిస్తోంది.

ఇవీ చూడండి:

చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details