ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యాదాద్రికి చేరిన సాలహారాల విగ్రహాలు

యాదాద్రి పంచనార సింహుల సన్నిధి సాలహారాల్లో పొందుపరచనున్న దేవతా మూర్తుల విగ్రహాలు ఆలయానికి చేరాయి. వైష్ణవత్వం ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక రూపాలతో విగ్రహాలు తీర్చిదిద్దారు. వీటిని కర్నూలు జిల్లాకు చెందిన శిల్పకారులు రూపొందించారని యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ తెలిపింది.

idols-of-deities
idols-of-deities

By

Published : Jan 20, 2021, 2:50 PM IST

తెలంగాణ యాదాద్రి పంచనార సింహుల సన్నిధిలోని సాలహారాల్లో పొందుపరచనున్న దేవతా మూర్తుల విగ్రహాలు దేవాస్థానానికి చేరుకున్నాయి. ఆలయం నలువైపులా కృష్ణశిలతో నిర్మితమైన అష్టభుజ మండప ప్రాకారాల్లోని వెలుపలి సాలహారాల్లో వైష్ణవత్వం ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక రూపాలతో విగ్రహాలను తీర్చిదిద్దారు.

ఏపీలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో కృష్ణశిలతోనే విగ్రహాలు రూపొందించారని యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) ప్రధాన స్థపతి డా.వేలు తెలిపారు.

బాహ్య ప్రాకారాల్లో గల సాలహారాల్లో.. అష్టలక్ష్మీ, దశావతారాలు, ఆళ్వార్లు, శ్రీకృష్ణుడు, దేవతామూర్తుల రాతి విగ్రహాలు బిగించే పనులు చేపట్టనున్నారు. వీటితో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకొనుంది.

ఇదీ చూడండి:బైడెన్​ రాకకు వేళాయే.. ప్రమాణానికి సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details