రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 947 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,97,810కి పెరిగింది. వైరస్ నుంచి 377 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 4,715 క్రియాశీల కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా నమోదైన కేసులు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 మందికి, విశాఖలో 156, గుంటూరులో 145, కృష్ణాలో 113 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అనంతపురంలో 35, తూర్పుగోదావరిలో 58, కడపలో 40, కర్నూలులో 61 మందికి, నెల్లూరులో 43, ప్రకాశం 23, శ్రీకాకుళంలో 56, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 18 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 947 పాజిటివ్ కేసులు ఇదీ చదవండి:ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి పండుగ జరుపుకోవాలి: గవర్నర్