పెద్ద ఎత్తున నిషేధిత పొగాకు, జర్దాను సరఫరా చేస్తున్న చిన్న నాగరాజు అనే అంతర్రాష్ట నిందితుడిని ఆరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ (cp anjani kumar) తెలిపారు. అతని వద్ద నుంచి రూ.58 లక్షల విలువ చేసే 1475 కిలోల పొగాకు ఉత్పత్తులను (tobacco seized) స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. హైదరాబాద్, పెబ్బేరులోనూ ‘భారత్ ఏజెన్సీస్’ పేరుతో హోల్‌సేల్‌గా బీడీలు విక్రయిస్తున్నారని వివరించారు. చిన్న నాగరాజు నలభై ఏళ్లుగా భారత్ బీడీ విక్రయ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
కచ్చితమైన సమాచారంతో దాడులు..
నగరంలోని ఉస్మాన్‌గంజ్‌లోని ఓ గిడ్డంగిలో పొగాకు ఉత్పత్తులను (tobacco seized) నిల్వ చేశాడనే కచ్చితమైన సమాచారంతో సోదాలు చేసినట్లు సీపీ వివరించారు. అఫ్జల్ గంజ్ పోలీసుల సహకారంతో ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించినట్లు సీపీ ( Hyderabad cp) వెల్లడించారు.
గోదాం నుంచి సరఫరా
నిందితుడు చిన్న నాగరాజుకు 2017లో దిల్లీలో అమిత్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడిందని సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి టోబాకో ఉత్పత్తులు కొనుగోలు చేసి నగరంలోని ఉస్మాన్‌గంజ్‌లో ఉన్న గోదాంలో నిల్వ చేశాడని సీపీ పేర్కొన్నారు. ఈ గోదాం నుంచి హైదరాబాద్‌లో ఉన్న పాన్ షాపులకు విషపూరితమైన, నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాడని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నగరంలో ఎవరైనా నిషేధిత పొగాకు, జర్దా, గంజాయిని ఎవరైనా విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ అంజనీ కుమార్ (cp anjani kumar) కోరారు.
ఇప్పటి వరకు 1475 నిషేధిత పొగాకును (banned tobacco)సీజ్ చేయడం జరిగింది. దీని విలువ రూ.57 వేలకు పైగా ఉంది. ఉస్మాన్ గంజ్‌లోని ఓ గొడౌన్లో నిల్వ చేశాడు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని బండిమెట్టకు చెందిన చిన్న నాగరాజును అదుపులోకి తీసుకున్నాం. పెబ్బేరు-వనపర్తిలో ఏరియాలో ఓ ఏజెన్సీలో పని చేశారు. అతనికి దిల్లీకి చెందిన వారితో పరిచయం ఉంది. ప్రజలు ఎవరికైనా ఇలాంటి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ అపరేషన్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి అభినందనలు. - అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ