ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ కేసులో దర్యాప్తు పురోగతి ఎంత వరకు వచ్చింది..? - ap high court latest news

న్యాయవ్యవస్థను కించపరిచేలా, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్​లు పెట్టినవారిపై ఎన్ని కేసులు నమోదు చేశారని హైకోర్టు సీఐడీని ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతి ఎంత వరకు వచ్చిందనే తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలపాలని కోరింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్​కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.

How far has the investigation progressed in postings case ..?
హైకోర్టు

By

Published : Jul 25, 2020, 5:38 AM IST

ఆంగ్లమాధ్యమంపై హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు న్యాయవ్యవస్థను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 16, 18 తేదీల్లో మొత్తం ఏడుగురిపై రెండు కేసులు నమోదు చేసినా.. దర్యాప్తులో పురోగతి లేదని రిజిస్ట్రార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం తాజాగా హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ మొదట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రెండు ఎఫ్ఐఆర్​లు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐడీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పులపై అభ్యంతరకర పోస్టింగ్​లు పెట్టినవారిపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ జరుపుతుందన్నారు. పోస్టింగ్​లపై హైకోర్టు రిజిస్ట్రార్ తమకు సమాచారం ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారన్నారు. న్యాయవ్యవస్థను కించపరుస్తూ నిందపూర్వక పోస్టింగ్​లు పెట్టినవారిపై బహుళ ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశామన్నారు. దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. మొదట నమోదు చేసిన రెండు ఎఫ్​ఐఆర్​ల విషయంలో పురోగతిపై తాజాగా ఆఫిడవిట్ దాఖలు చేశామన్నారు.

ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తర్వాత నమోదు చేసిన ఎఫ్​ఐఆర్ విషయంలో పురోగతిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓ స్వచ్ఛంద సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారని న్యాయవాది డీవీ రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ప్రయోజనార్థం మరికొన్ని సాక్ష్యాలను దాఖలు చేస్తామన్నారు. అనుబంధ పిటిషన్​ను అనుమతించాలని కోరారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. న్యాయస్థానం, న్యాయమూర్తులపై పోస్టింగ్​లు, చర్చలు జరిపిన వారిపై హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా పడింది. ఈ వ్యాజ్యంలో హైకోర్టు 88 మందికి నోటీసులు జారీచేసింది.

ఇదీ చదవండీ... ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details