జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నరేంద్రను జైలుకు ఎలా తరలిస్తారు..? అని కోర్టు ప్రశ్నించింది. ధూళిపాళ్లను రాజమహేంద్రవరం జైలుకు తరలిచడంపై అ.ని.శా. కోర్టులో పిటిషన్ దాఖలైంది. నరేంద్రను తమకు తెలియకుండా ఎలా తరలిస్తారని కోర్టు నిలదీసింది. తరలింపుపై కోర్టు అనుమతి ఎందుకు తీసుకోలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నరేంద్ర వారంపాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు తెలిపారన్న కోర్టు... ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు తెలిపినా ఎలా తరలించారు..? అని ప్రశ్నించింది.
నరేంద్రను రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రికి లేదా... విజయవాడ ఆయూష్ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. ధూళిపాళ్లను ప్రతిసారి విజయవాడకు పంపించాలంటే కష్టంగా ఉందని అ.ని.శా. న్యాయవాది కోర్టు వివరించగా... రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రిలో ఖాళీ ఉంటే అక్కడే చేర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. లేనిపక్షంలో విజయవాడ ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించింది. ఈసారి కోర్టు అనుమతి లేకుండా తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. ఈ విషయమై.. నరేంద్ర తరఫున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వాదించారు.