ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆసుపత్రుల భూముల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం.. అందుకోసమేనా? - ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల భూముల వివరాలు సేకరిస్తోంది. అయితే.. ఎందుకు సేకరిస్తున్నారో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. రుణాల పూచీకత్తు కింద భూముల వివరాలు చూపించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

hospital loans
hospital loans

By

Published : Nov 10, 2021, 11:39 AM IST

ఆసుపత్రుల భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. అసలు భూ విస్తీర్ణం ఎంత? ఎంత వరకు నిర్మాణాలు జరిగాయి? ఖాళీ భూమి ఎంత? స్థానిక మార్కెట్‌ విలువ ఎంత? సర్వే నంబరు, ఇతర నిర్మాణాలకు ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? ఏ శాఖ పరిధిలో ఈ భూములు ఉన్నాయి? వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే మొత్తం వివరాలు ఉన్నత స్థాయిలో సేకరిస్తున్నారు. ఎందుకు సేకరిస్తున్నారనేది మాత్రం తెలియడం లేదు. రుణాల కోసం పూచీకత్తు కింద ఈ భూముల వివరాలు చూపించే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు భావిస్తున్నాయి.

‘నాడు-నేడు’ కింద ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల భవన నిర్మాణాలకు నిధులు వచ్చే మార్గం పూర్తిస్థాయిలో ఇప్పటివరకు ప్రభుత్వానికి కనిపించడం లేదు. రుణాల కోసం గతేడాది నుంచి అధికారులు బ్యాంకులతో చర్చిస్తున్నా.. నిర్ణయాలు మాత్రం జరగడం లేదు. రుణాలు ఇస్తే తిరిగి చెల్లింపులు ఎలా అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన గ్యారంటీ లభిస్తేనే ముందుకు వెళ్లాలని బ్యాంకులు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వైద్య కళాశాలల్లో రోగులకు అందించే చికిత్సకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి జరిగే చెల్లింపులు, ఎంబీబీఎస్‌లో ‘బి’ కేటగిరీ సృష్టించి వచ్చే ఫీజుల ద్వారా పొందిన రుణాలకు తగ్గట్లు చెల్లింపులు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ బ్యాంకర్లకు హామీ ఇస్తోంది. మరో పక్క...నాబార్డు నుంచి రుణాలు పొందేందుకూ వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆసుపత్రుల భూముల వివరాలను సేకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

వ్యయం పెరిగిందని టెండరు ఖరారులో జాప్యం

నిధుల వ్యయం పెరగడంతో అంబులెన్సుల కొనుగోళ్ల టెండరు ఖరారులో జాప్యం జరుగుతోంది. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌లో భాగంగా కొత్తగా 539 అంబులెన్సులు కొనుగోలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తొలుత రూ.75 కోట్ల వరకు పరిపాలనాపరమైన ఆమోద ఉత్తర్వులు వెలువడటంతో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సేవల సంస్థ టెండర్లు పిలిచింది. రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్సుల్లో అదనపు సదుపాయాలు కల్పించాలని వ్యయాన్ని రూ.90 కోట్లకు పెంచింది. కానీ.. పెంచిన ఆ రూ.15 కోట్లకు పరిపాలనాపరమైన ఆమోద ఉత్తర్వులు రానందున టెండర్ల ఖరారులో జాప్యం నెలకొంది. దీనిపై ఇటీవల జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.

ఇదీ చదవండి:MLC polls in Guntur: ఎమ్మెల్సీ అవకాశం ఎవరికో .. ఆశావహులు వీరే!

ABOUT THE AUTHOR

...view details