హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీ కేసు విచారణ జరిగింది. విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై జస్టిస్ రాకేష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. తాను విచారణ కొనసాగించాలా? వద్దా? అనేది సీజే నిర్ణయిస్తారని జస్టిస్ రాకేశ్‌కుమార్ అన్నారు. కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ చూస్తానని అనుకోలేదన్నారు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవస్థ కోసం పని చేస్తున్నానన్న జస్టిస్ రాకేశ్‌కుమార్.. ప్రభుత్వ పిటిషన్‌పై ఈనెల 28న విచారణ చేస్తామని వెల్లడించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసింది.
కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది: జస్టిస్ రాకేష్ కుమార్
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో తాను విచారణ నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ రాకేష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసింది.
Hight court