నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. బందరు పోర్టు ఒప్పందం రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నవయుగ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ న్యాయవాదుల విధుల బహిష్కరణ కారణంగా విచారణ వాయిదా వేసింది. ఆగస్టు 8న జారీచేసిన జీవో 66ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని నవయుక కోరింది. పోర్టు పనుల కోసం భూములను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
బందరు పోర్టుపై విచారణ 12కు వాయిదా - బందరు పోర్టు
బందరుపోర్టుపై నవయుగ సంస్థ వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ఈనెల 12కు వాయిదా వేసింది.
highcourt_postponed_navayuga_petion_on_bandar_port