ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మండుతున్న ఎండలు... కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

High temperatures: రాష్ట్రంలో భానుడు భగభగా మండిపోతున్నాడు. నిప్పులు కక్కుతూ.. వేసవి ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు తన వేడిని పెంచున్నాడు. పశ్చిమ వాయవ్యం నుంచి ఉష్ణగాలులతో ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ చెబుతోంది. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.

High temperatures in ap
ఏపీలో ఎండలు

By

Published : Mar 29, 2022, 8:30 PM IST

High temperatures: రాష్ట్రంలో పశ్చిమ వాయవ్యం నుంచి ఉష్ణగాలులతో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కనిపించాయి. కోయిలకుంట్ల 42.6, గురజాలలో 41.85 డిగ్రీలు నమోదు కాగా... అనంతపురం 41.6, చిత్తూరు 41.55, జమ్మలమడుగులో 41.4 డిగ్రీలుగా రికార్డైంది.

కనిగిరిలో 41.2, తిరుపతిలో 40.2, విజయవాడలో 39.2 డిగ్రీలుగా ఉన్నాయి. విశాఖ 33.9, ఒంగోలు 36.8, గుంటూరు 37.4, నెల్లూరులో 39.7, కాకినాడ 34, విజయనగరం 36.9, ఏలూరులో 36.5 డిగ్రీలుగా నమోదయ్యాయి.



ఇదీ చదవండి: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details