మిడ్ లెవెల్ హెల్త్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. మిడ్ లెవల్ హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 1681 హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజినల్ బెంచ్ నిలిపివేసింది. గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై డివిజినల్ బెంచ్‌లో శివకృష్ణ రిట్ అప్పీల్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు విరుద్దంగా ఆయుష్ డాక్టర్ల పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. జాతీయ ఆరోగ్య విధానం-2017, ఆయుష్‌మాన్ భారత్ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందన్నారు.
మిడ్ లెవెల్ హెల్త్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీపై హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ - అమరావతి తాజా వార్తలు
12:10 October 13
రాష్ట్రంలో 1681 హెల్త్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి బ్రేక్
నోటిఫికేషన్ ప్రకారం.. బీఎస్సీ(నర్సింగ్)ను విద్యార్హతగా పేర్కొన్నారని జడ శ్రావణ్ కుమార్ అన్నారు. దేశంలోని ఏపీ మినహా అన్ని రాష్ట్రాలు... పోస్టుల భర్తీలో ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం తరఫున భర్తీకి అవకాశం ఇవ్వాలని.. రాబోయే ఎంపికల్లో వారి పేర్ల పరిశీలనకు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వాదనలు విన్న న్యాయస్థానం ప్రక్రియపై పై స్టే విధించింది.
ఇదీ విషయం:డాక్టర్ వైఎస్‌ఆర్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్‌లు- ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాల్లో 1681 ఎంఎల్‌హెచ్‌పీ నియామకం కోసం ఈ ఏడాది ఆగస్టు 9న ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై మిషన్ డైరెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వైద్యులు పి.అనీల్‌కుమార్, శివకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రక్రియలో ముందుకెళ్లడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.
ఇవీ చదవండి: