ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టులో కరోనా కట్టడికి చర్యలు.. మార్గదర్శకాలు విడుదల - high court restrictions for prevention of corona

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న క్రమంలో హైకోర్టులో నిబంధనలు కఠినతరం చేశారు. ఈ మేరకు హైకోర్టు సిబ్బందికి రిజిస్ట్రార్​ మార్గదర్శకాలు విడుదల చేశారు. హైకోర్టుకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని.. మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

హైకోర్టులో కరోనా కట్టడికి చర్యలు.. మార్గదర్శకాలు విడుదల
హైకోర్టులో కరోనా కట్టడికి చర్యలు.. మార్గదర్శకాలు విడుదల

By

Published : Jun 21, 2020, 8:31 AM IST

రాష్ట్రంలో ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో హైకోర్టు సిబ్బంది అనుసరించాల్సిన మార్గదర్శకాలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) రాజశేఖర్‌ విడుదల చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో కంటైన్మెంట్​ జోన్లు ఎక్కువ అవుతుండడం వల్ల హైకోర్టుకు వచ్చే వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

ఇవీ మార్గదర్శకాలు..

  • హైకోర్టు అధికారులు, సిబ్బంది కేంద్ర కార్యాలయం(హెడ్‌క్వార్టర్‌) విడిచి వెళ్లకూడదు. వెళితే తీవ్రంగా పరిగణిస్తారు.
  • అనుమతితో రాష్ట్రం వెలుపలకు వెళ్లినవారు విధుల్లోకి తిరిగి వచ్చే ముందు తక్షణం క్వారంటైన్‌కు వెళ్లాలి.
  • కోర్టు విధుల్ని ముగించుకున్న సిబ్బంది ఇళ్లకు వెళ్లాలి. జాగ్రత్తగా ఉండాలి. కనీస అవసరాలకు మాత్రమే ఇల్లు విడిచి బయటకు రావాలి. ఇతర అవసరాల నిమిత్తం ఇల్లు విడిచి బయటకు రావాలకున్న వారు.. ఆ అవసరం ఏమిటో ముందుగా నియంత్రణ అధికారులకు తెలియజేయాలి. సమావేశాల నిర్వహణ, ప్రదేశాల సందర్శనపై నిషేధం.
  • హైకోర్టు ప్రవేశమార్గం దగ్గర థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయించుకొని మాస్కులు ధరిస్తేనే అధికారులు, సిబ్బంది, పోలీసులు, సందర్శకులను లోపలికి అనుమతిస్తారు.
  • కరోనా లక్షణాలు ఉంటే కోర్టు ఆవరణలోకి అనుమతించరు. ఆ వ్యక్తి పేరు, చరవాణి నంబరు నమోదు చేసి రిజిస్ట్రార్‌ మేనేజ్‌మెంట్​కు సమర్పిస్తారు.
  • సిబ్బంది ఎల్లప్పుడు ముఖానికి మాస్కులు ధరించి ఉండాలి. వాటిని నిర్దేశించిన చెత్తకుండీలో మాత్రమే పడేయాలి.
  • కరోనా సంబంధ లక్షణాలుంటే తక్షణం నియంత్రణ అధికారికి సమాచారం ఇవ్వాలి.
  • కోర్టుకు వచ్చేప్పుడు, విధులు నిర్వహించేప్పుడు, తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు సిబ్బంది, వాహన డ్రైవర్లు భౌతిక దూరం పాటించాలి.
  • అధికారిక పని ఉన్నప్పుడు తప్ప.. హైకోర్టు వరండా, వివిధ విభాగాలు, భోజన సమయంలో ఒకచోట చేరడం నిషేధం.
  • సిబ్బంది అందరు గుర్తింపు కార్డులు ధరించాలి. పనివేళల్లో టీ, స్నాక్స్‌ కోసం సీˆటు విడిచి వెళ్లకూడదు. కార్యాలయ పని, భోజన సమయంలో తప్ప.. పని వేళల్లో సిబ్బంది ఎవరైనా సీటులో లేరని కనుగొంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. నియంత్రణ అధికారులు సిబ్బంది కదలిక రిజిస్టర్‌లో నమోదు చేస్తుండాలి. పనివేళల్లో సిబ్బంది కదలికలను భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తుండాలి.
  • ఏసీలను 24-30 డిగ్రీల ఉష్టోగ్రతలో పనిచేసేలా చూడాలి
  • కంటెయిన్‌మెంట్‌ జోన్ల పరిధిలో నివసించే అధికారులు, సిబ్బంది రాతపూర్వకంగా నియంత్రణ అధికారికి ఆ వివరాలు సమర్పించాలి.
  • భౌతిక దూరాన్ని పాటిస్తూ పరిమిత సంఖ్యలో లిఫ్ట్‌ను వినియోగించాలి
  • కోర్టు ప్రాంగణం, ఛాంబర్లు, కోర్టు హాళ్లు, విభాగాలు, సమావేశ మందిరాలు, మరుగుదొడ్లు, నీటి సరఫరా ప్రాంతాల్లో తరచు శానిటైజేషన్‌ చేయాలి.
  • హైకోర్టు ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషేధం.
  • వాహనాల్లోని సీట్లు, స్టీరింగ్‌, డోర్‌ హ్యాండిల్స్‌, తాళాలను డ్రైవర్లు తరచూ సోడియం హైపోక్లోరైట్తో శానిటైజేషన్‌ చేస్తుండాలి.
  • సిబ్బంది ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉంటే ఆ విషయాన్ని నియంత్రణ అధికారికి రాతపూర్వకంగా తెలియజేయాలి. గోప్యత పాటిస్తే తీవ్రంగా పరిగణిస్తారు.
  • కోర్టు వరండాల్లో జనసమూహం ఎక్కువ ఉండటానికి వీల్లేదు.
  • క్యాంటిన్‌లో ఆహారపదార్థాల్ని అందజేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించాలి.
  • అన్ని విభాగాల్లో చేతి శానిటైజర్లు, చేతుల్ని శుభ్రపరచుకొనే ద్రావణాన్ని అందుబాటులో ఉంచాలి.
  • దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి, ముక్కుకి టిష్యు లేదా చేతి రుమాలు లేదా మోచేతిని మడిచి అడ్డుపెట్టుకోవాలి.
  • కోర్టులోకి వచ్చే వరసలో ఒక్కొక్కరికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా నిలబడాలి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details