high court:అనంతపురంలో తెదేపా చెందిన మహిళ నేతల ఇళ్లలోని వంటగదుల్లోకి కూడా వెళ్లి సోదాలు ఎలా చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది . ఏమనుకుంటే అది చేస్తారా అని నిలదీసింది. రాష్ట్రంలో ఏమి జరుగుతోందని ప్రశ్నించింది. జిల్లాలో ఏమి జరుగుతుందో ఎస్పీకి తెలీదా అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై ఈనెల 21 న స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అనంతపురం జిల్లా ఎస్పీ, కేసును దర్యాప్తు చేస్తున్న ఇన్ స్పెక్టర్ ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. పోలీసులు దాఖలు చేసిన ఆఫిడవిట్లో వివరాలు సక్రమంగా లేకపోవడంతో న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు.
high court TDP women leaders issue: వంట గదుల్లోకి వెళ్లి సోదాలు చేస్తారా?
high court: అనంతపురంలో తెదేపా చెందిన మహిళ నేతల ఇళ్లలోని వంటగదుల్లోకి కూడా వెళ్లి సోదాలు ఎలా చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఏమనుకుంటే అది చేస్తారా అని నిలదీసింది.
ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో తెదేపా మహిళ నేతలు నలుగురికి ఇటీవల హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ల ఇళ్లపై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అనంతపురం జిల్లా ఎస్పీని ఆదేశించింది. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ .. పోలీసులు పిటిషనర్ల ఇళ్లలోని వంటగదుల్లోకి వెళ్లి సోదాలు చేశారన్నారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్పీ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: