ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2021, 5:02 PM IST

ETV Bharat / city

ధిక్కరణ కేసు: నల్గొండ కలెక్టర్​కు తెలంగాణ హైకోర్టు వినూత్న శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్... సామాజిక సేవ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలని స్పష్టం చేసింది.

high-court-orders-nalgonda-collector-to-do-social-service
ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయండి: తెలంగాణ హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా... సామాజిక సేవ చేయాలని తెలంగాణలోని నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలన్న కోర్టు... అలా.. 6 నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని తెలిపింది. ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని... విశ్రాంత పౌరసరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణిని హైకోర్టు ఆదేశించింది.

గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి 2వేల జరిమానా విధించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులు కొట్టేయాలంటూ హైకోర్టు ధర్మాసనానికి అధికారులు అప్పీల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం.. సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.

ABOUT THE AUTHOR

...view details