ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: ఆ కేసు విచారణకు డీజీపీ హాజరు కావాలి: హైకోర్టు - high court ordered to dgp

High Court: రేషన్ బియ్యం పేరుతో మిల్లర్లు, వాహనదారులను పోలీసులు వేధిస్తున్నారంటూ కర్నూలు రైస్‌మిల్‌ యజమాని వేసిన పిటిషన్​పై విచారించిన హైకోర్టు.. డీజీపీని మరోసారి హైకోర్టు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. చట్టప్రకారం వ్యవహరించాలని గతంలో ఆదేశించినా.. ఎందుకు తమ ఆదేశాలను పాటించడం లేదో చెప్పాలని ప్రశ్నిస్తూ ఎల్లుండి హాజరుకావాలని ఆదేశించింది.

High Court
హైకోర్టు

By

Published : Sep 28, 2022, 8:01 PM IST

High Court: రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించటంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. 'ఎసెన్షియల్ కమోడిటీస్' చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని న్యాయవాది రవితేజ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు పాటించకుండా రైస్ మిల్లులోని ఐదు వాహనాలను సీజు చేశారని తెలిపారు. జిల్లా అధికారులకు తెలియచేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు. కేసు నమోదు చేశారు కానీ... నిబంధనల ప్రకారం కలెక్టర్​కు నివేదించలేదన్నారు. అక్కడ అక్రమంగా బియ్యం తరలింపు జరుగుతుందని పోలీసు తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

అక్రమాలు జరిగితే చట్ట, నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని, ఆ విధంగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని గతంలో అనేక పర్యాయాలు హైకోర్టు.. డీజీపీకి ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ న్యాయవాది రవితేజ గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణకు డీజీపీ హాజరుకావాలని ఆదేశించింది. అనేకసార్లు న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎందుకు పాటించడం లేదో వివరించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details