ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే లీగల్ అధికారిగా రెడ్డప్పరెడ్డి కొనసాగింపుపై కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు - తితిదే లీగల్ అధికారిగా రెడ్డప్పరెడ్డి

తితిదే లీగల్ అధికారిగా రెడ్డప్పరెడ్డి కొనసాగింపుపై హైకోర్టు(high court on ttd Legal Officer of Reddappa Reddy)లో విచారణ జరిగింది. తితిదే లీగల్ అధికారిగా రెడ్డప్పరెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో తిరుపతికి చెందిన జర్నలిస్ట్ దొరస్వామి దాఖలు చేసిన పిటిషన్​పై న్యాయస్థానం విచారించింది.

high court on ttd Legal Officer of Reddappa Reddy
తితిదే లీగల్ అధికారిగా రెడ్డప్పరెడ్డి కొనసాగింపుపై హైకోర్టులో విచారణ

By

Published : Nov 12, 2021, 3:34 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం లీగల్ అధికారిగా రెడ్డప్పరెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టు(high court on ttd Legal Officer Reddappa Reddy)లో పిటిషన్​ దాఖలైంది. తితిదే లీగల్ అధికారి(ttd Legal Officer Reddappa Reddy)గా మాజీ న్యాయాధికారిని నియమించడంపై అభ్యంతరం తెలుపుతూ తిరుపతికి చెందిన జర్నలిస్ట్ దొరస్వామి కోర్టులో పిటిషన్​ వేశారు. లీగల్ అధికారిగా ప్రస్తుత న్యాయమూర్తిని నియమించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని తితిదేను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details