అధికారులు ఇచ్చిన నోటీసుకు ఏం సంజాయిషీ ఇచ్చారు? - ధర్మాసనం
కృష్ణానది కరకట్ట వద్ద నిర్మాణాన్ని వారం రోజుల్లో కూల్చేయాలంటూ సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ..ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రరావు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హై కోర్టు విచారణ జరిపింది.
కరకట్ట వద్ద నిర్మాణాన్ని కూల్చేయాలంటూ... ఈనెల 19న సీఆర్డీఏ ఇచ్చిన తుది నోటీసును సవాలు చేస్తూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. అధికారులు ఇచ్చిన నోటీసుకు సంజాయిషీ ఏమిచ్చారో... వివరాలతో సిద్ధపడి రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
మరోవైపు కరకట్ట వద్ద తనకు చెందిన నిర్మాణాన్ని కూల్చివేయకుండా ఆదేశించాలని కోరుతూ పాతూరి సుధారాణి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంలో ఎస్జీపీ జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఆందోళనతో కోర్టును ఆశ్రయించారన్నారు. తాము ఇచ్చిన సంజాయిషీ నోటీసులకు పిటిషనర్ వివరణ ఇచ్చారని, ఇంకా తుది ఉత్తర్వులు జారీచేయలేదని తెలిపారు. తొందరపాటు చర్యలు ఉండవని ధర్మాసనానికి తెలిపారు.