డిగ్రీ కళాశాలల్లో అన్లైన్ అడ్మిషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55ను సవాలు చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం(high court on Degree College Online Admissions ).. గతంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను వారంపాటు పొడిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదావేసింది. కళాశాలలకు అడ్మిషన్ల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను మరో వారంపాటు పొడిగించింది.