ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త బార్‌ పాలసీపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కౌంటరు దాఖలుకు ఆదేశం

Bar Policy: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బార్‌ పాలసీ-2022, తదనుగుణంగా జారీ చేసిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

High Court Notices to government on New Bar Policy
కొత్త బార్‌ పాలసీపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

By

Published : Jul 27, 2022, 11:50 AM IST

Bar Policy: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బార్‌ పాలసీ-2022, తదనుగుణంగా జారీ చేసిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నూతన బార్‌ పాలసీని సవాలు చేస్తూ 516 మంది బార్‌ యజమానులు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. మద్యం వ్యాపారంలో ఏ వ్యాపారీ నష్టపోరని వ్యాఖ్యానించింది.

ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమంది. మద్యం వ్యవహారంలో న్యాయస్థానాలు అరుదుగా జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించింది. బార్‌ లైసెన్సులను న్యాయస్థానాలు ఇవ్వలేవంది.

ఇదీ చదవండి:మద్యం పాలసీ జోవోపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details