ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC-AIDED : ఎయిడెడ్ విద్యాసంస్థల కొనసాగింపుపై హైకోర్టు విచారణ

ఎయిడెడ్ విద్యాసంస్థల కొనసాగింపుపై హైకోర్టు విచారణ జరిపింది. ఎయిడెడ్ కళాశాలల్లో పోస్టులు, ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతించకపోయినా గ్రాంట్ యథాతథంగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఎయిడెడ్ విద్యాసంస్థల కొనసాగింపుపై హైకోర్టు విచారణ
ఎయిడెడ్ విద్యాసంస్థల కొనసాగింపుపై హైకోర్టు విచారణ

By

Published : Oct 29, 2021, 5:13 AM IST

ఎయిడెడ్ కళాశాలల్లో పోస్టులు, ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతించకపోయినా గ్రాంట్ యథాతథంగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. విద్యా సంస్థలను స్వాధీనం చేయాలంటూ యాజమాన్యాలపై ఒత్తిడి చేయబోమని ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పష్టం చేశారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం వ్యవహారంలో అధికారులు ఒత్తిడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ధర్మాసనం సూచించింది. ఆ అధికారి వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులకు తెలిపింది. వారిపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఆర్థిక సాయం నిలిపేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదంటే తమకు అప్పగించాలని కోరుతూ ఏపీ విద్యా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీచదవండి.

FISHERMEN : మత్స్యకారులకు కొత్త చిక్కులు... ఇసుక మేటలతో పడవల రాకపోకలకు ఆటంకాలు

ABOUT THE AUTHOR

...view details