కరోనా సమయంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మద్యం విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యంపై అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వ న్యాయవాది చదివి వినిపించారు. కొవిడ్ సమయంలోనూ ఆన్లైన్లో అమ్మకాలు చేపట్టవచ్చని సుప్రీం తీర్పునిచ్చింది. దాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు ముందుంచారు.
దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆ తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు వర్తించదని, రాష్ట్రంలో క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అయినప్పటికీ కరోనా సమయంలో అమ్మకాలు జరిపారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.