HIGH COURT ON RAJADHANI FARMERS PETITION : రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయటం లేదని దాఖలైన పిటీషన్‌లపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసిందని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నవంబర్ మొదటివారంలో విచారణ జరిగే అవకాశం ఉందని వివరించి విచారణ వాయిదా వేయాలని కోరారు. సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్నందున సీఆర్డీఏ అమల్లో ఉంటుందని రైతుల తరుపు న్యాయవాది మురళీధర్ తెలిపారు. సీఆర్డీయే నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసే విధంగా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత దీన్ని విచారిస్తామని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
రాజధాని పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. సుప్రీంకోర్టు విచారణ తర్వాతే అని వ్యాఖ్య - RAJADHANI FARMERS PETITION
HC HEARING ON AMARAVATI CAPITAL PATITION : అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని రైతుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ఉన్నందున విచారణ వాయిదా వేసింది.
HC HEARING ON AMARAVATI CAPITAL PATITION