ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ కేసులను అనుమతి లేకుండా ఎలా ఎత్తి వేస్తారు: హైకోర్టు

High Court: ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను హైకోర్టు అనుమతి లేకుండా ఎలా ఎత్తివేస్తారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మీద ఉన్న 10 కేసులను ఎత్తివేయడాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులపై మొత్తం ఎన్ని కేసులు తొలగించారు.. వాటిలో ఎన్నింటికి హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

dismissal of cases against MLA Udayabhanu
dismissal of cases against MLA Udayabhanu

By

Published : Jun 22, 2022, 3:22 PM IST

High Court on MLA Udayabhanu Cases: ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై నమోదైన 10 కేసులు ఎత్తివేయడాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. కేసులు ఎత్తివేసేటప్పుడు హైకోర్టు అనుమతి తీసుకున్నారా? అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతి తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యే సామినేనిపై కేసులు ఎత్తివేయడంపై సామాజికవేత్త చెవుల కృష్ణాంజనేయులు పిటిషన్​ దాఖలు చేశారు.

ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసును తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని న్యాయమూర్తి వివరించారు. అనుమతి లేకుండా కేసులు ఎలా ఎత్తి వేస్తారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై మొత్తం ఎన్ని కేసులు తొలగించారు. వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details