High Court on Bigg Boss reality show: బిగ్‌బాస్ షోలో అశ్లీలత పెరిగిందని సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఐబీఎఫ్ గైడ్‌లైన్స్ పాటించలేదని పిటిషన్ తరఫు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది... ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
బిగ్‌బాస్ రియాల్టీ షో... అశ్లీలతపై ఘాటుగా స్పందించిన హైకోర్టు - ఏపీ తాజా వార్తలు
High Court on Bigg Boss reality show: బిగ్‌బాస్ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిగింది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.
బిగ్‌బాస్ రియాల్టీ షోపై హైకోర్టు
అశ్లీలతపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం తరఫు న్యాయవాది... సమయం కావాలని కోర్టును కోరారు. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: