ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: 'చిన్న చిన్న కారణాలతో అనర్హులుగా ప్రకటించడం ఏమిటి..?' - hearing in high court

తెదేపా హయాంలో ఇచ్చిన గృహాల లబ్ధిదారుల అనర్హతను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

High Court dismissed the disqualification of the beneficiaries of the houses
High Court : 'చిన్న చిన్న కారణాలు చూపి అనర్హులుగా ప్రకటించడం ఏమిటి..?'

By

Published : Jun 25, 2021, 3:09 PM IST

తెలుగుదేశం హయాంలో ఇచ్చిన గృహాల లబ్ధిదారులు ఇళ్ల పట్టాలకు అనర్హులుగా ప్రకటిస్తూ వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. పీఎంఏవై-ఎన్​టీఆర్ గృహ లబ్ధిదారుల్లో కొంతమందికి విద్యుత్తు బిల్లు అధికంగా వచ్చిందనే కారణంతో అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధనతో ఇళ్లపట్టాలు పొందలేకపోయిన కొంతమంది మంగళగిరి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. చిన్నచిన్న కారణాలు చూపి అనర్హులుగా ప్రకటించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది.

ABOUT THE AUTHOR

...view details