స్వచ్ఛంద సంప్రదింపుల ద్వారా భూసేకరణను సవాలు చేస్తూ... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్తి భగవాన్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. భూ సేకరణ చట్టం-2013 నిబంధనలకు విరుద్ధంగా... ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరిస్తున్నారని పిల్లో పేర్కొన్నారు. సంప్రదింపుల ద్వారా భూ సేకరణ నిమిత్తం పాలనాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి, తూర్పు, పశ్చిమ, గుంటూరు, కృష్ణా జిల్లాల పాలనాధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
'స్వచ్ఛంద సంప్రదింపులు'పై పూర్తి వివరాలు ఇవ్వండి: హైకోర్టు - ఏపీ హైకోర్టు తాజా వార్తలు
పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా స్థలాలిచ్చేందుకు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 'స్వచ్ఛంద సంప్రదింపులు' ద్వారా భూసేకరణ జరపడాన్ని సవాలు చేస్తూ... దాఖలైన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
హైకోర్టు