ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజృంభిస్తున్న కరోనా... ప్రభుత్వం కీలక ఆదేశాలు - latest updates of corona cases

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నోటీసులు అంటిస్తున్నారు. పాజిటివ్‌ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికీ ర్యాపిడ్‌ సర్వే చేపట్టాలని సీఎం ఆదేశించారు. హాట్‌స్పాట్‌ల వద్ద మరింత అలర్ట్‌ ప్రకటించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/06-April-2020/6682322_hvc.png
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/06-April-2020/6682322_hvc.png

By

Published : Apr 6, 2020, 3:38 PM IST

కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తుండడంపై.. రాష్ట్రంలో అధికార యంత్రాంగం హై అలర్ట్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కరోనా పరిస్దితిపై సీఎం వైఎస్‌ జగన్‌... వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ఆదేశాలు జారీ చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలిచ్చారు.

ర్యాపిడ్ సర్వే...

పాజిటివ్‌ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం, జలుబు, ఇతరత్రా కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి శాంపిల్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంత మందికి కరోనా పాజిటివ్‌ ఉందనీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆ ప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా రెడ్‌ జోన్‌గా ప్రకటిస్తున్నారు. అనుమానితులు, పాజిటివ్‌ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక, అవసరాన్ని బట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత పరిధి వరకు హైపోక్లోరైడ్‌ స్ప్రేతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు మరింత మెరుగు పరుస్తున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండంతో ఆయా ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటిస్తున్నారు. ఈ కారణంగానే పాజిటివ్‌ కేసులన్నీ త్వరగా బయటికి వస్తున్నాయి. హాట్‌ స్పాట్ల వద్ద మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పకడ్బందీగా జియో ట్యాగింగ్

కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు జియో ట్యాగింగ్‌ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలిచ్చారు. పాజిటివ్‌ కేసులు, మర్కజ్‌ సంబంధీకులు ఉన్న ప్రాంతాల్లో జియోట్యాగింగ్‌ పనులు వేగంగా చేస్తున్నారు. హోం క్వారంటైన్లలో ఉంటున్న వారిపై వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులతో కూడిన బృందాలు నిఘా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. హోం క్వారంటైన్లలో ఉంటున్న వారు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తున్నాయి. ఒక్కో బృందం దాదాపు ఇరవై మంది హోం క్వారంటైన్‌లోని వ్యక్తులను పరిశీలిస్తోంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details