ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిప్పుల కొలిమిలా కోస్తాంధ్ర.. ఇవాళ, రేపు భగభగలే!

Temperature: రాష్ట్రంలో గత మూడ్రోజులుగా భానుడు భగభమంటున్నాడు. ఓవైపు నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినప్పటికీ.. ఎండలు మాత్రం తగ్గడంలేదు. గురువారం రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లో.. మరో రెండు డిగ్రీలు పెరిగి.. 47కు చేరుకుంటుందని అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

summer
summer

By

Published : Jun 3, 2022, 8:31 AM IST

Updated : Jun 3, 2022, 9:00 AM IST

Temperature: కోస్తాంధ్ర నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గురువారం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా చేరాయి. 86 మండలాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుండగా.. 424 మండలాల్లో ఉష్ణతాపం ఉక్కిరిబిక్కిరి చేసింది. శుక్రవారం గరిష్ఠంగా 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లా మోగులూరులో 45.24 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నందరాడలో 44.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 44.6, ఏలూరు జిల్లా టి.నరసాపురంలో 44.65 డిగ్రీల చొప్పున నమోదైంది. కృష్ణా, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా నమోదైంది.

నేడు, రేపు మంటలే:

శుక్రవారం.. 46 నుంచి 47 డిగ్రీలు- అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు. పల్నాడు, బాపట్ల

43 నుంచి 45 డిగ్రీలు- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి

శనివారం.. 45 నుంచి 47 డిగ్రీలు:అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం

43 నుంచి 45 డిగ్రీలు :విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌

*శుక్రవారం రాష్ట్రంలోని 157 మండలాల్లో వడగాలులు, 83 మండలాల్లో తీవ్ర వడగాలులు.. శనివారం 147 మండలాల్లో వడగాలులు, 68 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. 540 పైగా మండలాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 3, 2022, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details