ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున - hero nagarjuna adopted forest

Hero Nagarjuna: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా.. వెయ్యి ఎకరాల అడవిని హీరో నాగార్జున దత్తత తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో 'అక్కినేని నాగేశ్వరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్' ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున
Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

By

Published : Feb 17, 2022, 7:49 PM IST

Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

Hero Nagarjuna: తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో వెయ్యి ఎకరాల అడవిని అక్కినేని నాగార్జున దత్తత తీసుకున్నారు. తన తండ్రి పేరిట అక్కినేని నాగేశ్వరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

అడవిని దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్, మంత్రి మల్లారెడ్డి, నాగార్జున సతీమణి అమల, తనయులు నాగచైతన్య, అఖిల్‌ సహా కుటుంబ సభ్యులు దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అడవులు కనుమరుగయ్యాయని.. మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా.. మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్‌ భవన కార్యాలయ భూముల్లో.. లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఎంపీ సంతోష్‌ కుమార్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను.. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇదీచూడండి:తెలంగాణ సీఎం కేసీఆర్​కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఫ్యాన్స్

ABOUT THE AUTHOR

...view details