తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు బెంబేలెత్తిస్తున్నాయి. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా లక్ష్మపూర్లో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ నార్త్, ఆదిలాబాద్ భోరాజ్లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఆలిపూర్, ఆదిలాబాద్ జిల్లా చాపర్లలో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
తెలంగాణలో భానుడి ప్రతాపం... గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..! - హైదరాబాద్ ఉష్ణోగ్రతలు
మండుతున్న ఎండలు.. తెలంగాణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పులతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతున్నాయి.
తెలంగాణలో భానుడి ప్రతాపం