ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అక్కడి సిబ్బంది, కేసుల వ్యవహారంపై ఏ నిర్ణయం తీసుకున్నారు..?'

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్​లో సిబ్బంది, కేసుల వ్యవహారంపై నిర్ణయం తీసుకోకుండానే ఏపీఏటీని రద్దు చేస్తూ... కేంద్ర ప్రభుత్వం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వివరాలు సమర్పించాలని... రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

hearings in high court over ap administration tribunal
హైకోర్టు

By

Published : Jul 21, 2020, 3:10 AM IST

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్​లో వ్యాజ్యాలు, అక్కడి సిబ్బంది వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో వివరాలు సమర్పించాలని... రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బి.కృష్ణమోహన్​తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది, కేసుల వ్యవహారంపై నిర్ణయం తీసుకోకుండానే ఏపీఏటీని రద్దు చేస్తూ... కేంద్ర ప్రభుత్వం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details