ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VIDADALA RAJINI: పడకల సంఖ్యకు తగ్గట్లుగా వైద్యులు: మంత్రి రజిని - ఆరోగ్యశాఖ మంత్రి రజిని తాజా వార్తలు

VIDADALA RAJINI: వైద్య విధాన పరిషత్​ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆసుపత్రుల్లో పడకల సంఖ్యకు తగ్గట్లుగా వైద్యులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టామని.. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు.

VIDADALA RAJINI
VIDADALA RAJINI

By

Published : Jul 12, 2022, 8:15 AM IST

VIDADALA RAJINI: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆసుపత్రుల్లో పడకల సంఖ్యకు తగ్గట్లుగా వైద్యులు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టామన్నారు. ‘ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇకపై రాష్ట్రంలోని 30 పడకల ప్రభుత్వాసుపత్రుల్లో ఎనిమిది మంది వైద్యులు సహా మొత్తం 31 మంది సిబ్బంది ఉంటారు.

50 పడకల్లో 11 మంది వైద్యులు సహా 43 మంది, 100 పడకల సీహెచ్‌సీల్లో... 150 పడకల ఏరియా ఆసుపత్రుల్లో 23 మంది వైద్యులతో కలిపి మొత్తం 95 మంది సిబ్బంది, 150 పడకల జిల్లా ఆసుపత్రుల్లో 128 మంది, 200 పడకలు కలిగిన చోట 154, 300 పడకల్లో 180 మంది, 400 పడకల ఆసుపత్రుల్లో 227 మంది వైద్యులు, సిబ్బంది పనిచేస్తారు. రానున్న రెండు, మూడు నెలల్లో ఈ మార్పులు జరుగుతాయి...’ అని ఆమె వివరించారు. రూ.1,220 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయన్నారు. పారిశుద్ధ్యం, డైట్‌, సెక్యూరిటీ ఏజెన్సీలు పనితీరు సవ్యంగా లేకుంటే...రాజీ ధోరణి అవలంబించకుండా బిల్లుల చెల్లింపులు నిలిపేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో వైద్య సేవలు సంతృప్తికరంగా లేవన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details