ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 13, 2019, 7:39 AM IST

ETV Bharat / city

ఏపీలోని యువతకు శిక్షణ అందించేందుకు హెచ్​సీఎల్ సుముఖత

ఆంధ్రప్రదేశ్​లోని యువతకు శిక్షణ అందించేందుకు హెచ్​సీఎల్ సంస్థ అంగీకారం తెలిపింది. అలాగే యువతకు శిక్షణ ఇచ్చేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించడానికి సుముఖత వ్యక్తం చేసింది.

hcl

మంత్రి మేకపాటితో హెచ్​సీఎల్ సంస్థ ప్రతినిధులు భేటీ

రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాభివృద్ధికి అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు హెచ్​సీఎల్ సంస్థ ముందుకు వచ్చింది. శిక్షణ పరమైన అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని వెలగపూడిలోని సచివాలయంలో హెచ్​సీఎల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం కలిశారు. హెచ్సీఎల్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ అందించాలని మంత్రి కోరగా... అందుకు వారు అంగీకారం తెలిపారు. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్​సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. హెచ్​సీఎల్ క్యాంపస్​ని సందర్శించాలంటూ ప్రతినిధులు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆహ్వానించారు. అదే విధంగా వచ్చే జనవరి నుంచి హెచ్​సీఎల్ ప్రారంభించనున్న శిక్షణ పరమైన కార్యక్రమాలకు రావాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ మంత్రిని కోరారు. యువతకు శిక్షణ అందించేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని మంత్రి కోరగా.. అందుకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. సమావేశపు సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details