చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు వైకాపా జెండా రంగులను తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశామని పేర్కొంది. ఆ వివరాల్ని నమోదు చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదే శాలిచ్చింది. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండల పరిధి, కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో .. తడి, పొడి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని ప్రశ్నిస్తూ జైభీమ్ యాక్సెస్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరస సురేశ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. దానిపై గతంలో విచారణ చేసిన హైకోర్టు.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేంద్రాలకు వేసిన వైకాపా రంగులను తొలగించాలని, ఇకమీదట అలాంటి రంగులేయకుండా తక్షణం ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు తేల్చి చెప్పింది. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాల మేరకు రంగులు తొలగించినట్లు ప్రభుత్వం అఫిడవిట్ వేసిందన్నారు.
ఆ కేంద్రాలకు పార్టీ రంగు తొలగించాం: ప్రభుత్వం - వైకాపా రంగులపై హైకోర్టు
చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు వైకాపా జెండా రంగులను తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశామని పేర్కొంది.
hc on ycp colors