మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు, మరికొందరి విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నిబంధనలు పాటించాలని.. పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ ఆరోపణలతో నమోదైన కేసులో.. ముందస్తు బెయిల్ కోసం నారాయణ కుమార్తెలు, అల్లుడు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా ఈ వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి. వాదనలు వినిపించేందుకు అదనపు ఏజీ అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నారని అదనపు పీపీ కోర్టుకు తెలిపారు. విచారణను వాయిదా వేయాలన్నారు. సమయం ఇవ్వడానికి నిరాకరించిన న్యాయస్థానం సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ప్రస్తుత పిటిషనర్ల విషయంలోనూ.... 41ఏ నిబంధనలను పాటించాలని పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది.
వారి విషయంలో 41ఏ నిబంధనలు పాటించండి: హైకోర్టు - హైకోర్టు తాజా వార్తలు
పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకుల ఆరోపణలతో నమోదైన కేసులో హైకోర్టు విచారణ జరిగింది. మాజీ మంత్రి నారాయణ కూతుర్లు, మరికొందరి దాఖలు చేసిన పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈకేసులో అనుమానితులపై సెక్షన్ 41 ఏ నిబంధనలు పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
వారి విషయంలో 41ఏ నిబంధనలు పాటించండి