ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC ON KABADDI: 'వారిని జాతీయ ఛాంపియన్ షిప్​నకు అనుమతించండి' - ఏపీ శాప్ వార్తలు

HC ON KABADDI : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ పంపిన పేర్లను జూనియర్, సీనియర్ కబడ్డీ ఛాంపియన్​ షిప్ ఆడేందుకు అనుమతించాలని హైకోర్టు.. భారత అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్​ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎం. రంగారావు ఆదేశాలిచ్చారు.

hc on kabaddi sport
hc on kabaddi sport

By

Published : Dec 18, 2021, 7:00 AM IST

HC ON KABADDI : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ పంపిన పేర్లను కబడ్డీ క్రీడలకు అనుమతించాలని భారత అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్​ను హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్ రుద్రపూర్ జిల్లాలో డిసెంబర్ 28 నుంచి 31 వరకు జరిగే సబ్ జూనియర్ జాతీయ ఛాంపియన్ షిప్ , మహారాష్ట్రలో జనవరిలో జరిగే సీనియర్ మహిళ జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్​నకు శాప్ పంపిన క్రీడాకారుల పేర్లను క్రీడలకు అనుమతించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. విచారణను జనవరి 20కి వాయిదా వేశారు.

జాతీయ కబడ్డీ క్రీడలకు పంపేందుకు పేర్లను ఎంపిక చేసేలా ఏపీ స్పోర్ట్ అథారిటీని, ఆ పేర్లను పరిగణనలోకి తీసుకునేలా భారత ఆమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్​ను ఆదేశించాలని కోరుతూ 16 మంది మహిళ కబడ్డీ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించారు. వివాదాల కారణంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారుల పేర్లను ఎంపిక చేసి పోటీలకు పంపడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details