కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై.. జరిమానా విధించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. మాస్కులు ధరించకపోవడం తదితర విషయాల్లో ఉలంఘనలు జరిగినందుకు ఎంత మేరకు జరిమానాలు వసూలు చేశారు.. జీవో అమలుకు ఏం చేసారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోను... తమ ముందు ఉంచాలని సూచించింది. ఒమికాన్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షల నిర్వహణపై ఐసీఎంఆర్ సూచనలను కోర్టు ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.
'కొవిడ్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరించండి' - hc latest news
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమికాన్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షల నిర్వహణపై ఐసీఎంఆర్ సూచనలను కోర్టు ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
hc on corona rules