రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. తదుపరి విచారణను అక్టోబర్ 5 కు వాయిదా వేసింది. అప్పటి వరకూ రాజధానిపై ఉన్న యథాతథస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతిమ తీర్పు వచ్చే వరకూ స్టేటస్‌కో ఎత్తేసే పరిస్థితి ఉండకపోవచ్చని.. న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు.
రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా
రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా పడింది. రాజధానిపై ఉన్నయథాతథ స్థితిని అక్టోబర్ 5 వరకు పొడిగించింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టే అవకాశం ఉందని న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు.
HC on Capital petitions in amaravathi